Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:50 AM

రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత

02-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: రోగులకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. హాస్పిటల్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

CSR నిధుల ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో హాస్పిటల్ నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

ఇంకా రూ.50 లక్షల నిధులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, హాస్పిటల్‌ను 50 పడకల నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

SRR చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రోగులకు శుద్ధమైన తాగునీరు అందించేందుకు RO ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ESI హాస్పిటల్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పంపినట్లు చెప్పారు.

ఈ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత HDSతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రోగులకు మెరుగైన వైద్యం లక్ష్యం: మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News