Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:57 PM

రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు

28-04-2026 245 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పదో తరగతి (SSC) ఫలితాలు రేపు ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఈ మేరకు ప్రకటిస్తూ ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ప్రధాన పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన వెంటనే జవాబుపత్రాల మూల్యాంకనం వేగవంతంగా చేపట్టి ఏప్రిల్ 23 నాటికి పూర్తిచేసిన అధికారులు, అనంతరం మార్కుల నమోదు, ధృవీకరణ, సాంకేతిక ప్రక్రియలను ముగించి ఫలితాల విడుదలకు సిద్ధమయ్యారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కులు, గ్రేడ్‌లు తెలుసుకోవచ్చు. విద్యార్థుల భవిష్యత్ విద్యా ప్రస్థానానికి కీలకమైన ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Sthanikam

రేపు విడుదల కానున్న SSC ఫలితాలు.. పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News