Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు

12-03-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యమకారుల గుర్తింపుకు చర్యలు వేగవంతం చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించి విధివిధానాలను త్వరగా అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రూపొందించిన విధివిధానాల డ్రాఫ్ట్ కాపీని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోరం నాయకులు అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు Dr. చీమ శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో TUF కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న తో పాటు పలువురు ఉద్యమకారులు హాజరయ్యారు. ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి ఉద్యమకారుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఫోరం నాయకులు తెలిపారు.

Sthanikam

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు

Article Image

ఉద్యమకారుల గుర్తింపుకు చర్యలు వేగవంతం చేయాలి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించి విధివిధానాలను త్వరగా అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రూపొందించిన విధివిధానాల డ్రాఫ్ట్ కాపీని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోరం నాయకులు అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు Dr. చీమ శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో TUF కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న తో పాటు పలువురు ఉద్యమకారులు హాజరయ్యారు. ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి ఉద్యమకారుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఫోరం నాయకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News