Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

రామన్నపేట మండల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి.

28-04-2026 148 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం తహసిల్దార్ లాల్ బహదూర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని గ్రామాల్లో ప్రజా సమస్యలు తీవ్రంగా పేరుకుపోయాయని, అధికార యంత్రాంగం పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎండాకాలం తీవ్రతతో బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్య ఉద్ధృతమైందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

పారిశుద్ధ్యానికి నిధుల కొరతతో గ్రామాలు అస్వచ్ఛంగా మారుతున్నాయని, ఉపాధి హామీ పనుల్లో ఫోటో హాజరు సమస్యలతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో రైతులు ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభం కాకపోవడం ఆందోళనకరమన్నారు.

రామన్నపేట–అమ్మనబోలు, కక్కిరేణి ప్రధాన రహదారులు గుంతలతో దెబ్బతిని ప్రయాణాలు దుర్భరంగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లుగా కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు కాకపోవడంతో అర్హులు ఇబ్బందులు పడుతున్నారని, రెండో దశ ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు పారదర్శకంగా మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, గాదె నరేందర్, తొలుపునూరి శ్రీనివాస్, మునికుంట్ల లెనిన్, మేడి ముకుంద, శానగొండ రామచంద్రం, పల్లె సత్యం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట మండల సమస్యలు పరిష్కరించాలని తహసిల్దార్ కు వినతి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News