Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘రెడీ టు సర్వ్’ వృద్ధాశ్రమానికి చిరంజీవి సాయం

27-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పు ట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలతో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనయుడి పుట్టినరోజును పురస్కరించుకుని చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘రెడీ టు సర్వ్’ వృద్ధాశ్రమానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆశ్రమ నిర్వాహకుడు పెద్ది శంకర్‌కు అందజేశారు. ఆశ్రమంలోని వృద్ధులకు కొత్త బట్టలు పంపిణీ చేయడంతో పాటు, వారికి ప్రత్యేకంగా భోజనం వడ్డించారు.

వృద్ధులకు సేవ చేయడంలో ‘రెడీ టు సర్వ్’ సంస్థ చేస్తున్న సేవలను చిరంజీవి అభినందించారు. నిర్వాహకుడు పెద్ది శంకర్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ విరాళాన్ని వృద్ధాశ్రమానికి శాశ్వత స్థలం ఏర్పాటు కోసం వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. మెగాస్టార్ అందించిన మద్దతుతో ఆశ్రమ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు పేర్కొన్నారు.

Sthanikam

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘రెడీ టు సర్వ్’ వృద్ధాశ్రమానికి చిరంజీవి సాయం

Article Image

ఎల్బీనగర్,

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్పు ట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలతో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనయుడి పుట్టినరోజును పురస్కరించుకుని చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘రెడీ టు సర్వ్’ వృద్ధాశ్రమానికి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును ఆశ్రమ నిర్వాహకుడు పెద్ది శంకర్‌కు అందజేశారు. ఆశ్రమంలోని వృద్ధులకు కొత్త బట్టలు పంపిణీ చేయడంతో పాటు, వారికి ప్రత్యేకంగా భోజనం వడ్డించారు.

వృద్ధులకు సేవ చేయడంలో ‘రెడీ టు సర్వ్’ సంస్థ చేస్తున్న సేవలను చిరంజీవి అభినందించారు. నిర్వాహకుడు పెద్ది శంకర్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ విరాళాన్ని వృద్ధాశ్రమానికి శాశ్వత స్థలం ఏర్పాటు కోసం వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. మెగాస్టార్ అందించిన మద్దతుతో ఆశ్రమ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News