Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:24 AM

రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం

28-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

గో సంరక్షణ, గో సేవకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని ఉద్యమ ప్రతినిధుల డిమాండ్

న్యాల్కల్, స్థానిక ప్రతినిధి:

గో సేవా–గో రక్షణ ఉద్యమ ప్రతినిధులు న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం సమర్పించారు. దేశీయ గో వంశ పరిరక్షణ, గో హత్య నివారణ, గో సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు కల్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న ప్రత్యేక స్థానం దృష్ట్యా గో సంరక్షణకు చట్టబద్ధ రక్షణ అవసరమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. గో హత్య పూర్తిస్థాయిలో నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, గో సేవకు ప్రత్యేక శాఖ, గో పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.దేశీయ గోవుల సంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల ప్రోత్సాహం, గో ఆధారిత జీవన విధానానికి ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో గో సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభు వినతిపత్రాన్ని స్వీకరించి సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ ప్రబంధ్ అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ పవర్, దేవాలయ శాఖ కార్యదర్శి అశోక్ కుమార్, యువ నాయకులు కమ్మరి రాజు, గార్లపల్లి సాయికుమార్, గొల్ల శ్రీశైలం, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రక్షణకు చట్టబద్ధ చర్యలు చేపట్టాలి – న్యాల్కల్ తహసీల్దార్ ప్రభుకు వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News