Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:17 AM

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

04-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

రైతులు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధ్యమని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ జానయ్య తెలిపారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తలు నేరుగా రైతుల ముంగిట్లోకే వస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 55 గ్రామాల్లో సుమారు 50 వేల మంది రైతులకు పంటల మార్పిడి, సాగు విధానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

రైతులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వ్యవసాయం సంక్షోభంలో లేదని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల లోపం, నకిలీ విత్తనాలు ప్రధాన సమస్యలని పేర్కొన్నారు. రసాయనిక క్రిమిసంహారక మందుల అధిక వాడకం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.

ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి పాటిస్తే భూసారం పెరిగి దిగుబడులు మెరుగుపడతాయని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు ఇబ్బంది కలిగించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అంజిరెడ్డి, డాక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి – వీసీ జానయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News