Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ;ఎమ్మెల్యే సామెల్

22-07-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో వరి సాగుకంటే ప్రత్యామ్నాయ పంటలే మేలని తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ అన్నారు.మండల పరిషత్ లో మాట్లాడుతూ...

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయన్నారు . బోర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. అలాగే చెరువులుపూర్తిస్థాయిలో నిండే పరిస్థితి కనిపించడం లేదని, చివరి దశలో వర్షాలు వచ్చినా కూడా చెరువులు పూర్తిగా నిండే అవకాశం తక్కువగా ఉందన్నారు.

అందువల్ల రైతులు మొత్తం విస్తీర్ణంలో వరి సాగు చేయకుండా, కొంత భాగంలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు .

తక్కువ నీటితో సాగు చేయగల పంటలు:

జొన్న,పెసలు,మినుములు,కంది,పొద్దుతిరుగుడు,ఆముదం లాంటి పంటలు సాగు చేయటం ఉత్తమం అన్నారు.రాబోయే రోజుల్లో బోర్లు, చెరువుల ద్వారా నీటి లభ్యత మరింత తగ్గే అవకాశం ఉన్నందున, నీటిని ఆదా చేస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలన్నారు.

రైతులందరూ పరిస్థితు లను దృష్టిలోఉంచుకుని వరి సాగును కొంత మేర తగ్గించి, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి ;ఎమ్మెల్యే సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News