Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

రేపాల గ్రామంలో కేఎల్ఎన్ రావుకు ఘన నివాళి

22-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన ప్రముఖ నాటక రచయిత, కవి కోదాటి లక్ష్మీనర సింహారావు (కె ఎల్ రావు) కళా రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రేపాల గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ, మరియు తెలంగాణ నాటక సమాజాల సమైక్య మునగాల మండల అధ్యక్షులు పొనుగోటి రంగా అన్నారు. కేఎల్ రావు 24వ వర్ధంతి సందర్భంగా బుధవారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాటక రంగంలో ఎన్నో బహుమతులు అందుకొని గ్రామ వెలుగు నాట్యమండలి స్థాపించి ఎందరినో కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత కేఎల్ రావు కే దక్కిందన్నారు. దూరదర్శన్లో ఆర్టిస్టుగా పనిచేసిన కేఎల్ రావు ద్వారా రేపాలకు ఎంతో గుర్తింపు వచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఎల్ ట్రస్టు మెమోరియల్ అధ్యక్షులు పందిరి పుల్లారెడ్డి, దొడ్డి కొమరయ్య సినీ సహనిర్మాత అంకతి అనసూర్య, గ్రామ వెలుగు నాట్యమండలి ప్రధాన కార్యదర్శి సారిక పెద్దరామయ్య, కళాకారులు గవిని పెదలక్ష్మీనరసింహం, సారిక పెద్ద లింగయ్య, గవిని కోటయ్య, గండు వీరయ్య, గండు సత్యనారాయణ మాస్టర్, గుండు దేవదాసు, జిల్లేపల్లి వీరస్వామి, గండు రవి, గండు స్వామి, రావు జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రేపాల గ్రామంలో కేఎల్ఎన్ రావుకు ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News