Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

రైతులతో రాజకీయాలా?.. రేవంత్ సర్కారుపై రామ్ చందర్ రావు ఫైర్

30-04-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, ప్రతినిధి:

రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు మండిపడ్డారు.

జిల్లా పరిధిలోని హనుమపురం గ్రామంలో జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్యతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ సర్కారు రైతులతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. గతంలో రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోయాయని గుర్తుచేశారు. సందర్శించిన కేంద్రంలో 20 రోజులుగా కేవలం రెండు లారీలు మాత్రమే ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొంటూ, వందకు పైగా కుప్పలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పరిస్థితికి ఇదే నిదర్శనమని అన్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, గన్ని బ్యాగులు వంటి సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు.

ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు ఆలస్యం చేసి కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కిసాన్ మోర్చా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రైతులతో రాజకీయాలా?.. రేవంత్ సర్కారుపై రామ్ చందర్ రావు ఫైర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News