Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

29-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ పంటల రైతుల సమస్యలపై పెనుకొండలో ఆందోళన ఉదృతమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠించి ధర్నా చేపట్టారు.

రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. MSP ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల ఆధీనంలోకి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.

ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ—మొక్కజొన్న MSP రూ.2,400గా ఉన్నా, మార్కెట్‌లో మాత్రం రూ.1,600కే కొనుగోలు జరుగుతోందని, దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.600-700 వరకు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒక్కో రైతుకు లక్షల్లో నష్టం వస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Sthanikam

రైతుల ధర్నా: గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News