Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

రైతుకు అందని "యూరియా"

రైతుకు అందని "యూరియా"

రైతుకు అందని "యూరియా"
10-02-2026 519 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

అన్నదాతపై టెక్నాలజీ ‘ఉరి’ యా!

యూరియా కోసం రోడ్డుపై రైతుల ధర్నా

ప్రజాపాలనలో రైతుకు ఊరట లభిస్తుందన్న ఆశలు అడియాసలవుతున్నాయి. వేల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటను కాపాడుకునే కీలక దశలో అన్నదాత యూరియా కోసం అల్లాడిపోతున్నాడు. ప్రభుత్వం పారదర్శకత పేరుతో ప్రవేశపెట్టిన 'ఫార్మర్ యాప్' విధానం క్షేత్రస్థాయిలో రైతుకు వరంగా కాక... శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్ఫోన్ వినియోగం తెలియని సామాన్య రైతులు, ముఖ్యంగా సన్న, చిన్న, కౌలు రైతులు ఈ డిజిటల్ వ్యవస్థలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ లేకుండా యూరియా దక్కని పరిస్థితి రైతును దిక్కుతోచని స్థితికి నెట్టేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫెర్టిలైజర్ షాపుల్లో యూరియా స్టాక్ ఉన్నప్పుడే యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలన్న నిబంధన రైతులను ఉ క్కిరిబిక్కిరి చేస్తోంది. యాప్ స్టాక్ అప్డేట్ అయిన కొద్ది నిమిషాల్లోనే 'స్టాక్ ఖాళీ' అనే సందేశం దర్శనమిస్తోంది. వేగంగా స్మార్ట్ఫోన్ వాడటం రాని రైతులకు ఇది మొండిచేయే అవుతోంది. ఉదయం నుంచి షాపుల చుట్టూ తిరిగినా, చివరకు యూరియా లేక ఖాళీ చేతులతో ఇంటికి చేరాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

*యూరియా కోసం రోడ్డుపై రైతుల ధర్నా*

తమకు యూరియా లభించలేదని ఆవేశంతో వలిగొండ మండల కేంద్రంలో రైతులు నడిరోడ్ పై ధర్నా చేపట్టారు. పంటకు అందాల్సిన యూరియా తమకు సకాలంలో అందకపోవడంతో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

*కౌలు రైతుల దుస్థితి వర్ణనాతీతం*

ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భూమి సొంతం కాకపోవడంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే వీరు, ఇప్పుడు యూరియా కోసం యాప్ల చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. చాలామంది కౌలు రైతుల వద్ద స్మార్ట్ఫోన్ కూడా లేకపోవడంతో ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. అప్పటికే స్టాక్ ఖాళీ అవుతుండటంతో వారి ప్రయత్నాలు ఫలించకపోతున్నాయి. పట్టాదారు పాస్బుక్ ఆధారంగా జరిగే యాప్ బుకింగ్లో కౌలు రైతులకు సరైన గుర్తింపు లేకపోవడం వారి కష్టాలను రెట్టింపు చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

రైతుకు అందని "యూరియా"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News