Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:44 AM

రైతు బజార్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

12-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి జిల్లా :వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం బుధవారం ఉదయం 9:20 గంటల సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రైతు బజార్ ప్రాంతంలోని హుడా పార్క్ ఎదురుగా ఒక వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, చాక్లెట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతను బిక్షాటన చేసే వ్యక్తిగా అనుమానం వ్యక్తమవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు చుట్టుపక్కల విచారణ చేపట్టినప్పటికీ అతని గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Sthanikam

రైతు బజార్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News