Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

రాబందు కాళ్ళకి GPS ట్రాకర్, భయందోళనలో ప్రజలు

18-01-2026 567 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బహిరందిబ్బ గ్రామ శివారులో అరుదైన వన్యజీవి రాబందు ప్రత్యక్షమైంది.ఎన్నో సంవత్సరాలుగా అసలు సంచారమే లేని రాబందు జిపిఎస్ ట్రాకర్ తో గ్రామశివారులోని ఓ చెను వద్ద కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందారు.రాబంధువు కాళ్లకు నెంబర్స్ తో కూడిన ట్యాగ్ ఉండటంతో గ్రామస్తులు కొందరు భయాందోళన చెందారు.గ్రామస్థులు పారెస్ట్ ఆఫీసర్ కి సమాచారం ఇవ్వడంతో గ్రామానికి వచ్చిన ఎప్ ఆర్వో వికాస్ రాబందు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో రాబందులు అంతరించిపోయే దశలో ఉన్నాయని,లక్షల్లో ఉన్న రాబందులు అనేక కారణాల వల్ల వేలల్లో మాత్రమే ఉన్నాయని,వాటిని కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది అని,ప్రజలు అరుదైన జాతి పక్షులకు ఎటువంటి హాని తలపెట్టవద్దని,గ్రామంలో కనిపించిన రాబందు బహుశా మహారాష్ట్ర నుండి వచ్చి ఉండొచ్చు అని రాబందులు దేశంలో ఎక్కడెక్కడ తిరిగిన వాటి లొకేషన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ సహాయంతో ట్రేస్ చేస్తుందని,రాబందు కు అమర్చిన పరికరాలు వాటిని నిరంతరం పర్యవేక్షణ చేయడనికి అని ప్రజలు ఎవ్వరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని వికాస్ తెలిపారు.

Sthanikam

రాబందు కాళ్ళకి GPS ట్రాకర్, భయందోళనలో ప్రజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News