విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు
తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటమే అసలైన ఆస్తి అని, విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు దక్కుతుందని 2006-07 బ్యాచ్ కోదాడ మండలం తొగర్రాయి పూర్వ విద్యార్థులు అన్నారు. సోమవారం గ్రామంలో ఆనాటి నేస్తాల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. 20 సంవత్సరాల తరువాత ఒక్కచోట కలుసుకున్న స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆనందంగా గడిపారు.అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎం ఈ ఓ సలీం షరీఫ్, హెచ్ ఎం లు రాజు, శ్రీదేవి, ఉపాధ్యాయులు ఏడు కొండలు, శ్రీను అలాగే తిరపయ్య లను ఘనంగా సన్మానించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి