Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్

పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్

పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్
28-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా పుకార్లేనని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆలూరు నూర్ అహ్మద్ తెలిపారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా, కొన్ని పత్రికల ద్వారా ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.

ఈ పుకార్ల కారణంగా ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేస్తుండగా, కొందరు దీనిని ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. దీంతో సాధారణ ప్రజలకు ఇంధనం అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పక్క రాష్ట్రం కర్నాటకలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా లభిస్తున్నాయని, దీని ద్వారా రాష్ట్రంలో అసలు కొరత లేదని స్పష్టమవుతోందన్నారు. ఇది కొందరు కావాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి యన్ . చంద్రబాబు నాయుడు కు చెడ్డపేరు తెచ్చేందుకు చేస్తున్న కుట్రగా పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి కార్డన్ సెర్చ్‌లు నిర్వహించాలని, అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

Sthanikam

పుకార్లతో ఇంధన కొరత భావన: నూర్ అహ్మద్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News