Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 03:33 PM

పోలీసు శిక్షణ కేంద్రంలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన.... కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్

పోలీసు శిక్షణ కేంద్రంలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన.... కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్

పోలీసు శిక్షణ కేంద్రంలో  పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన....   కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్
April 07, 2026 06:05 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పోలీసు శాఖ సర్వీసులోని ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్ కు సబ్ ఇన్ స్పెక్టర్ పదోన్నతికి ఎంపిక పరీక్షలు ...

పోలీసు శిక్షణ కేంద్రంలో పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన....

కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్.

కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ ఆధ్వర్యంలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పర్యవేక్షణలో కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలను కర్నూలు ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ ఐపియస్ మంగళవారం పరిశీలించారు.


రాయలసీమ జోన్ పరిధిలోని ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్ మొత్తం 72 మంది ఈ ఎస్సై పదోన్నతి పరీక్షలకు హాజరైనారు.


ఇండోర్ పరీక్షలు ...


పేపర్ 1 - ఎగ్జామ్ లో - ఐ.పి.సి(భారతీయ శిక్షాస్మృతి), నేరప్రక్రియ కోడ్ (సి.ఆర్.పిసి) భారతీయు సాక్ష్యాధారాల చట్టం, ప్రత్యేక స్ధానిక చట్టాలు,


పేపర్ 2 - ఎగ్జామ్ లో - పోలీసు విధానం, విచారణ న్యాయం, వైద్య విషయాలు, నేర వైజ్ఞానిక శాస్త్రం, వేలు ముద్ర, పాద ముద్రలు, శాస్త్రీయ సహాయం, నేరాలను నిరోధించడం , గుర్తించడం వంటి తదితర విభాగాలపై పరీక్షలు నిర్వహించారు.

ఏప్రిల్ 8 వ తేది బుధవారం ఔట్ డోర్ పరీక్షలు నిర్వహిస్తారు.

డ్రిల్లు, ఆయుధాల పై పరిజ్ఞానం , నేర స్ధల పరిశీలన, మౌఖిక పరీక్ష(ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ పరీక్షల నిర్వహణకు డిటిసి ప్రిన్సిపల్ హుస్సేన్ పీరా , డిటిసి వైస్ ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టారు.

ఆయా పరీక్షలలో ప్రతిభ కనబరచిన వారికి సబ్ ఇన్ స్పెక్టర్ లుగా పదోన్నతులు కల్పిస్తారు.

ఈ పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డిటిసి ప్రిన్సిపాల్ హుస్సేన్ పీరా , కర్నూలు డిటిసి డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గప్రసాద్ , డిఎస్పీ లు శ్రీనివాసులు, బాల స్వామి రెడ్డి , సూర్యనారాయణ రెడ్డి, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి , నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్ డిఐజి మేనేజర్ రత్నప్రకాష్, సిఐలు , ఎస్సై లు , డిఐజి ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News