Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:01 AM

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు
06-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రెండు ఆర్థిక సంఘాల కింద తెలంగాణకు రూ.14,110 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. 14వ ఆర్థిక సంఘం మరియు 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.14,110 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 14వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు రూ.5,060 కోట్లు కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం కింద రూ.9,050 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ రెండు ఆర్థిక సంఘాల కింద కలిపి రాష్ట్రానికి రూ.14,110 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా 14వ ఆర్థిక సంఘం కింద రూ.5,060 కోట్లు, 15వ ఆర్థిక సంఘం కింద రూ.6,051 కోట్లు కలిపి మొత్తం రూ.11,111 కోట్లను 2025 డిసెంబర్ 31 నాటికి విడుదల చేశారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో మొత్తం రూ.1,034 కోట్ల 42 లక్షల నిధులను విడుదల చేసింది. గ్రామీణ స్థానిక సంస్థలు ఇప్పటివరకు వినియోగించిన నిధుల వివరాలను సమర్పిస్తూ వినియోగ ధృవీకరణ పత్రాలను అందిస్తే మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

Sthanikam

పంచాయతీ రాజ్ సంస్థలకు కేంద్ర నిధులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News