Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:35 AM

పిల్లి రామరాజు యాదవ్ గృహ నిర్బంధం

పిల్లి రామరాజు యాదవ్ గృహ నిర్బంధం

పిల్లి రామరాజు యాదవ్ గృహ నిర్బంధం
24-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసుల అడ్డుకోలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత నిప్పులు.. భారీ మూల్యం తప్పదని హెచ్చరిక..

​నల్గొండ: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామునే ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేసి స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ఈ సందర్భంగా రామరాజు యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు కనీస స్వేచ్ఛ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. "ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అణచివేత ధోరణి కంటే మిన్నగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోంది" అని ఆయన ఆరోపించారు.​ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, కాంగ్రెస్ పతనానికి ఇవే నాంది అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని, అప్పుడు ఇప్పుడు అక్రమాలకు పాల్పడుతున్న వారు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని రామరాజు యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Sthanikam

పిల్లి రామరాజు యాదవ్ గృహ నిర్బంధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News