Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు

27-01-2026 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మిక వర్గాన్ని విస్మరించి, కార్పొరేట్లకు మరియు పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఏ. బాలకృష్ణ, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐటీయూసీ జిల్లా గౌరవ సలహాదారు అశోక్ కుమార్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్యలు విమర్శించారు.

మంగళవారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గాల వారీగా డివిజన్ సదస్సులు నిర్వహించాలని, ఫిబ్రవరి 6న జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మికుల యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును, సమస్యలపై పోరాడే హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాల పేరుతో శాశ్వత ఉద్యోగాలకు ఎగనామం పెడుతున్నారని, కంపెనీల మూసివేతకు ప్రభుత్వ అనుమతులు అవసరం లేదన్న నిబంధనలు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయంగా మారాయని అన్నారు. మొత్తంగా ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఊరితాళ్లుగా మారాయని, వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి అంశాల్లో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు అన్ని వర్గాల వారు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా నాయకులు బెల్లంకొండ గురవయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు సాయి కుమార్, ఐఎన్‌టీయూసీ నాయకులు మెల్లచెరువు ముక్కంటి, కరుణాకర్ రెడ్డి, చింతకాయల రాము తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి : కార్మిక సంఘాల పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News