Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య

29-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

ఫ్యూచర్ సిటీ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా ఎక్కడనేది స్పష్టంగా చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో పోలీస్ కమిషనరేట్‌కు శంకుస్థాపన చేయడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు అన్న విషయాల్లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు.

ప్రజా సమస్యల కంటే పరిపాలనా యంత్రాంగంపై దృష్టి పెట్టడం సరికాదని, ప్రజా ఉద్యమాలను బలహీనపరచే విధానాలు అనుసరిస్తోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పాలనపై కూడా విమర్శలు గుప్పించిన ఆయన, హామీల అమలులో విఫలమైందని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో లోపాలు, నిరుద్యోగ సమస్యలు, భూమి పంపిణీ వంటి అంశాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు.

జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ, యాదాద్రి భువనగిరి జిల్లాకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం తరఫున ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం లవణం ఉపేందర్ టోజు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఎక్కడ?’ యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా ఎక్కడ? – సీపీఎం నేత వీరయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News