Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:22 PM

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

03-05-2026 213 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేయడం వివాదానికి దారి తీసింది.

ఈ ఘటనపై 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, కాంగ్రెస్ నాయకుడు కమ్మంపాటి సతీష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్ నాయకులే కారణమని వారు ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతోనే ఈ చర్య జరిగిందని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత ద్వేషం, రాజకీయ అసహనం కారణంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు.దళిత కౌన్సిలర్ అయిన తాను బాల నర్సింహా స్వామి కళ్యాణంలో పాల్గొనడం నచ్చకనే తన ఫ్లెక్సీలను చింపివేశారని కుక్కల మోహన్ ఆరోపించారు.ఇలాంటి “చిల్లర రాజకీయాలు” చేస్తున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

Sthanikam

ఫ్లెక్సీ చింపివేతతో చిట్యాలలో రాజకీయ వేడి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News