Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

పెంపుడు కుక్క కడుపులో ప్లాస్టిక్ కవర్లు

పెంపుడు కుక్క కడుపులో ప్లాస్టిక్ కవర్లు

పెంపుడు కుక్క కడుపులో ప్లాస్టిక్ కవర్లు
21-02-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పెంపుడు కుక్క కడుపులో ప్లాస్టిక్ కవర్లు

కోదాడ లో అరుదైన ఘటన

ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ భూతం భారిన పడిన ఆవులు, గొర్రెలు, కోళ్లు గురించిన కథనాలు విన్నాము. అవన్నీ మరువనే లేదు ఇప్పుడు కుక్కల పొట్టలో సైతం ప్లాస్టిక్ సంచులు బైటకు వస్తున్నాయి. ఇంకా భవిష్యత్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్ని వింతలు ప్రమాదాలు సృష్టిస్తాయో చూడాల్సిందే.

వివరాల్లోకి కోదాడ పట్టణం నివాసి ఒకరు తాను పెంచుకునే పెంపుడు కుక్కని పక్కన అతను కర్రతో కొట్టాడడం తో తొడ బొక్కలు విరిగి బాధపడుతుంటే వైద్యం కోసం ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు.

పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి పెంటయ్య , కుక్క కాలులో విరిగిన బొక్కలు అతికించడానికి పిన్/ రాడ్ వేయడం కోసం తొలి సెడేషన్ ఇవ్వగా ఉదయం తాగిన పాలతో పాటు పెద్ద ప్లాస్టిక్ సంచి వాంతుల్లో బైటకు రావడం చూపరులకు ఆశ్చర్యం వేసింది. అది కూడా ఎవరో టిఫిన్ తెచ్చుకొని తిని మిగిలిన చట్ని తో కవర్ పడవేయగా పల్లి చట్ని వాసనకు ఆకర్షితమైన కుక్క కవరు తో సహా ఉదయం కడుపులోకి వెళ్లి ఉంటుంది. అనుకోకుండా కాలు విరగడం వైద్యం కోసం మత్తు ఇవ్వడంతో ప్లాస్టిక్ సంచి బైటకు వచ్చింది కానీ లేకపోతే రెండు మూడు రోజుల్లో దాని కడుపు నొప్పి భరించలేక ఎక్స్ రే తీసి పొట్ట కోసి ఆపరేషన్ ద్వారా పేగుల నుండి కవర్ ని బైటకు తీయాల్సి వచ్చేది.

కాలు విరిగినందుకు ఒకింత బాధలో ఉన్నా , అనుకోకుండా బైటకు పొట్ట బైటకు వచ్చిన ప్లాస్టిక్ కవరు అతిపెద్ద ప్రమాదాన్ని తొలగించడంతో సంబరపడిపోయాడు యజమాని.

ప్లాస్టిక్ కవరు బైటకు వచ్చిన అనంతరం విరిగిన కుక్క కాలుకి పిన్నంగ్ వేసి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సిమెంట్ కట్టు వేసి కుక్కకి ఉపశమనం కల్పించారు .అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో మనుష్యుల కంటే అత్యంత ప్రేమతో ఆడుకుంటున్న పెంపుడు కుక్కల యజమానులు , ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి బాధపడడం మాత్రమే కాక వాటిని చూస్తూ యజమానులు సైతం దుఃఖించాల్సి వస్తుందని, యజమానులు తమ ఇళ్లలో వాడి పడేసే ప్లాస్టిక్ కవర్ల విషయం లో అత్యంత జాగ్రత్త వహించి అవి కుక్కలకు అందుబాటులో లేకుండా చూడాలని అన్నారు.

చికిత్సా కార్యక్రమములో సిబ్బంది రాజు, చంద్రకళ, కర్ణ పాల్గొన్నారు.

Sthanikam

పెంపుడు కుక్క కడుపులో ప్లాస్టిక్ కవర్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News