Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:35 AM

పెనుకొండలో డా. ఫెర్రర్ జయంతి వేడుకలు

పెనుకొండలో డా. ఫెర్రర్ జయంతి వేడుకలు

పెనుకొండలో డా. ఫెర్రర్ జయంతి వేడుకలు
09-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ,: శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణ సమీపంలోని ఇస్లాపురం గ్రామంలో ఆర్‌డీటీ పాఠశాలలో దివంగత డా. ఫెర్రర్ 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్‌డీటీ ప్రతినిధులు, సభ్యులు సంయుక్తంగా ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుకొండ తెలుగుదేశం పార్టీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, కౌన్సిలర్ హనుమంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్‌డీటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో డా. ఫెర్రర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆర్‌డీటీ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి వంటి అనేక రంగాల్లో ప్రజలకు సేవలు అందాయని తెలిపారు.

గత కొన్నేళ్లుగా సంస్థ రీన్యువల్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్‌డీఏ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చొరవతో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సంస్థకు రీన్యువల్ సాధించారని చెప్పారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు మళ్లీ ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు డా. ఫెర్రర్ సేవలను కొనియాడారు.

Sthanikam

పెనుకొండలో డా. ఫెర్రర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News