Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

పెన్షన్ సమస్యల పరిష్కారానికి టిడిపి చొరవ

01-05-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: ఒంటరి మహిళలు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చొరవ చూపారు. ఈ నెల 27న పత్రికలో వచ్చిన “పెన్షన్, టెన్షన్, పరేషాన్” వార్తకు స్పందించిన టిడిపి నాయకులు అధికారులను కదిలించి బాధితులకు న్యాయం చేశారు.

మాజీ ఎమ్మెల్యే, ఆదోని టిడిపి ఇన్‌చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు మూడవ వార్డు దండిగేరి ప్రాంతానికి చెందిన వడ్డెమాన్ తాయమ్మకు పెన్షన్ అందజేశారు. అలాగే హనుమాన్ నగర్‌కు చెందిన పూర్తిగా వికలాంగురాలు మల్లమ్మ సమస్యను గుర్తించి, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయించి కర్నూలుకు పంపించడంతో బోయ ఎల్లమ్మకు కూడా పెన్షన్ మంజూరైంది.

ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ పేదలు, నిరుపేదలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సమయానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పెన్షన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి వెంటనే సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, రంగస్వామి నాయుడు, ఆలూరు ఎంపీడీవో మద్దిలేటి స్వామి, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పెన్షన్ సమస్యల పరిష్కారానికి టిడిపి చొరవ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News