Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

పేద ప్రజల కంటి వెలుగే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం

09-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ మర్రిగూడ బాధితులకు శంకరా ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు

​ రోగులను పరామర్శించిన ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్

పేద ప్రజల జీవితాల్లో కంటి వెలుగులు నింపడమే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన లక్ష్యమని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగోని మౌనిక గౌడ్ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎంపికైన రోగులకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శంకరా కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న బాధితులను ఆత్మీయంగా పలకరించారు.​వారి ఆరోగ్య పరిస్థితిని, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.మునుగోడు నియోజకవర్గంలో ఎవరికీ కంటి చూపు సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోంది. మర్రిగూడ మండలంలో ఇప్పటికే రెండవసారి ఉచిత కంటి ఆపరేషన్ల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. బాధితులకు ఉచిత రవాణా, భోజన వసతితో పాటు అత్యాధునిక వైద్య సేవలను ఫౌండేషన్ తరఫున అందిస్తున్నాం.​ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, మర్రిగూడ మండలానికి చెందిన రోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ప్రజల కంటి వెలుగే రాజగోపాల్ రెడ్డి లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News