Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:03 AM

పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు

26-02-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎవరూ ఆందోళన చెందవద్దు – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా

జర్నలిస్టులకు పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే గుర్తింపు కార్డులు జారీ చేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్ జర్నలిస్టుల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన 252, 103 ఉత్తర్వులలో కేబుల్ చానెల్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల జారీ విషయంలో అన్యాయం జరిగిందని నాయకులు మంత్రికి తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, సిటీ కేబుల్ నిర్వహణాధికారి శివరామకృష్ణ, ఎం.ఎస్.ఓ సంఘం నాయకులు వంగా శ్రీనివాస్ రెడ్డి, కేబుల్ చానెల్ సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు కడకంచి వెంకటేష్, హెచ్.వి. చలపతి, దేవేందర్, అరవింద్, బ్రహ్మం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News