Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:16 AM

ప్రతి సోమవారం ప్రజావాణి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహణ. కలెక్టర్

02-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: జిల్లాలో ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శనివారం విడుదల చేసిన ప్రకటనలో, ఆయా ఆర్‌డీఓ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్‌డీఓ నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు హాజరై ప్రజల వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి వినతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఇకపై ఎన్ఐసీ పోర్టల్‌కు బదులుగా సీజీజీ ప్రజావాణి పోర్టల్ ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి వినతిదారునికి యూనిక్ రిఫరెన్స్ నంబర్‌తో రసీదు అందజేస్తారని, దాని ద్వారా వినతి స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.

అధికారులు వినతులను 30 రోజుల్లోగా పరిష్కరించి నివేదికలను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఆలస్యమైతే కేసులు ఉన్నతాధికారులకు పంపబడతాయని హెచ్చరించారు. ప్రజలు సీజీజీ ప్రజావాణి పోర్టల్‌ను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రజలకు త్రాగునీరు, కూర్చునే సదుపాయం, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Sthanikam

ప్రతి సోమవారం ప్రజావాణి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహణ. కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News