Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు

14-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట పోలీస్ పరిధిలో నాలుగో వార్డు కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, రోడ్డు భద్రతను కాపాడటం అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

ఈనెల 13 నుండి 18 వరకు నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతూ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ప్రతిజ్ఞ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రమాదాలకు గురయ్యే జంక్షన్‌లను గుర్తించి జీబ్రా క్రాసింగ్‌లు, లేన్ మార్కింగ్‌లు, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని హెచ్చరించారు.

నాలుగో వార్డులో భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని ఆమె పేర్కొన్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పన్నీరు లక్ష్మణ్, ములుగు నరసింహ, విజయ్, వార్డు ప్రజలు విజయ, మాధవి, అండాలు, పోలీస్ సిబ్బంది మాధవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – కౌన్సిలర్ కాటబత్తిని స్వప్న ఆంజనేయులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News