Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

ప్రత్యర్థుల కలయికతో రాజకీయ వర్గాల్లో చర్చ

10-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో శనివారం రాజకీయ ప్రత్యర్థులు అనుకోకుండా ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని కారులో వెళ్తుండగా, ఎదురుగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వాహనం వచ్చింది. ఒకరిని ఒకరు గుర్తించిన ఇద్దరూ తమ కార్లను ఆపి కిందకు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఈ సందర్భంగా మండుటెండల్లో రైతులు కల్లాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వడ్ల కొనుగోళ్లు వేగంగా జరగడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి దిగుబడి అధికంగా వచ్చిందని, అందువల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ అధికారులతో మాట్లాడి కొనుగోళ్లు మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.రాజకీయంగా ప్రత్యర్థులైన ఇద్దరు నేతలు అనుకోకుండా కలుసుకుని స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Sthanikam

ప్రత్యర్థుల కలయికతో రాజకీయ వర్గాల్లో చర్చ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News