Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

29-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ,

రాజకీయాలకు అతీతంగా నల్లగొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది.

నగరంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి రూ.10 లక్షలు చొప్పున కేటాయించినట్లు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ మాట్లాడుతూ విలీన ప్రాంతాల్లో ఇళ్లకు అసెస్‌మెంట్ చేపడితే కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని సూచించారు. అలాగే స్మశానవాటికలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారికి గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

30వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి గాంధీనగర్‌లో రోడ్డుపైకి మెట్లు నిర్మిస్తున్న భవన యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 24వ డివిజన్ కార్పొరేటర్ గోపగాని స్వాతి నూతన మాస్టర్ ప్లాన్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించాలని సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ అశ్రఫ్ అలీ, కమిషనర్ బి. శరత్ చంద్ర, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

పార్టీలకతీతంగా నగర సమగ్రాభివృద్ధి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News