Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేత రావెళ్ల కృష్ణారావు ధ్వజం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:03 AM

ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం..

ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం..

ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం..
28-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బుద్ధవనం ప్రాజెక్టు అద్భుతం శ్రీలంక మంత్రి సునీల్‌ సేన్వి..

నాగార్జునసాగర్‌ : ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో ప్రపంచంలో శాంతి స్థాపన అత్యంత కీలకమని ఇందుకు బుద్ధుని బోధనలే శరణ్యమని శ్రీలంక రిలీజియస్‌, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్‌ సేన్వి అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ‘బుద్ధవనం’ను సందర్శించారు.

21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, ప్రతినిధులతో కలిసి ప్రాజెక్టులోని విశేషాలను ఆయన ఆసక్తిగా తిలకించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ కట్టడాలు అత్యంత ప్రాచుర్యం పొందడం సంతోషకరమన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు ఎంతో విశిష్టమైనది. ఇక్కడి నిర్మాణాలు, శిల్పకళ అద్భుతంగా ఉన్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ బుద్ధ శాంతి సమావేశం నాకు ఎంతో సంతృప్తిని సరికొత్త అనుభవాన్ని మిగిల్చింది అని కొనియాడారు. సమకాలీన ప్రపంచానికి శాంతి ఎంతో అవసరమని బుద్ధవనం వంటి ఆధునిక బౌద్ధ నమూనాలను శ్రీలంకలోనూ విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.మంత్రి పర్యటనలో భాగంగా 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, భిక్షుణీలు, విదేశీ ప్రతినిధులు బుద్ధవనంలోని స్తూపాలను దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో బుద్ధవనం చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రాజెక్టు రూపకర్త, మాజీ డీజీపీ శ్రీ ఆంజనేయ రెడ్డి, ప్రముఖ నటుడు గగన్ మాలిక్, వియత్నాం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిక్నాథ్ టు, నవ నలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ సింగ్, స్థానిక శాసన సభ్యుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ శాంతికి బౌద్ధమే మార్గం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News