Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:59 AM

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
13-04-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ముంబై నగరంలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో సినీ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.1933లో మహారాష్ట్ర రాష్ట్రంలోని సాంగ్లీ పట్టణంలో ఆశా భోస్లే జన్మించారు. బాల్యంనుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకుని, వేలాది పాటలతో తన ప్రత్యేక ముద్ర వేశారు. ఆమె ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కూడా ప్రసిద్ధి చెందారు.తన గాన ప్రస్థానంలో ఆశా భోస్లే ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. అలాగే రెండు సార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు కైవసం చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఆమెకు భారత సినీ రంగంలోని అత్యున్నత గౌరవమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేశారు.అదేవిధంగా 2008లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ను అందుకుని గౌరవాన్ని చాటుకున్నారు.ఆశా భోస్లే మరణంతో భారతీయ సంగీతానికి తీరని లోటు ఏర్పడిందని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గాత్రం తరతరాల పాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందని అభిమానులు పేర్కొంటున్నారు.

Sthanikam

ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News