Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:26 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్

11-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాలలో మౌలిక వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులను చేపట్టారు.

రూ‌సా నిధులతో నిర్మించిన వెహికల్ షెడ్‌తో పాటు ప్రధాన రహదారి నుంచి కళాశాల భవనం వరకు నిర్మించిన సీసీ రోడ్డును కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలల్లో మౌలిక వసతుల పెంపు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు.

ఈ సందర్భంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. రామన్నపేట పరిసర ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందుతూ తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.ఈ

కార్యక్రమంలో ఇన్‌చార్జ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, డాక్టర్ పి. బ్రహ్మం, డాక్టర్ జె. నరేశ్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News