Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

పదో తరగతి ఫలితాల్లో ‘విశాల భారతి’ విజయకేతనం

29-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థుల ప్రతిభ

ప్రతిభావంతులను అభినందించిన సీఐ మన్మథ కుమార్, కరస్పాండెంట్‌ చైతన్య క్రాంతివర్ధన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో స్థానిక చౌటుప్పల్ పట్టణంలోని విశాల భారతి హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఫలితాలతో విజయకేతనం ఎగురవేశారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు కొలుకులపల్లి పుష్ప (554)​ బొమ్మగాని కార్తీక్ (543)​ తాళ్లూరి సాయి గంగా సుహాని (542) శివ కౌశిక్ (509), ఒంటెద్దు అక్షర (502) మార్కులతో విశిష్ట ప్రతిభ కనబరిచారు.​ ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మథ కుమార్ విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. కరస్పాండెంట్

పాఠశాల కరస్పాండెంట్ విసం చైతన్య క్రాంతివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కఠోర శ్రమ వల్లే వంద శాతం ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఆంటోనీ, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పదో తరగతి ఫలితాల్లో ‘విశాల భారతి’ విజయకేతనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News