Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:23 PM

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం
29-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పదో తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని తమ పాఠశాల కీర్తిని పతాక స్థాయికి చేర్చారు. గ్రీన్ గ్రోవ్ ​పాఠశాలకు చెందిన బాలగోని అక్షర్ 585 అత్యుత్తమ మార్కులతో మండలంలోనే మొదటి స్థానంలో నిలవగా.. పందిరి సహస్ర 581 మార్కులతో ప్రతిభను చూపించి మండలంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ​ఈ ఘన విజయంపై పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి, ఏవో పోలా గోవర్ధన్ మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కఠోర శ్రమ, ఉపాధ్యాయుల సరైన దిశానిర్దేశం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపి విద్యార్థులను ఘనంగా సన్మానించారు..

​

Sthanikam

పది ఫలితాల్లో ‘గ్రీన్ గ్రోవ్’ ప్రభంజనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News