Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:49 PM

నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంచిన మహానుభావుడు పాలడుగు : మంత్రి కొలుసు పార్థసారథి

20-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్:

నూజివీడు టౌన్ రాజీవ్ సర్కిల్ వద్ద నిర్మించిన మాజీ మంత్రి స్వర్గీయ పాలడుగు వెంకట్రావు విగ్రహ ఆవిష్కరణ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.మాట్లాడుతూ నూజివీడు అనగానే గుర్తుకొచ్చేది పాలడుగు వెంకట్రావు అని గుర్తుచేశారు. నాడు మంత్రి గా ఉన్న అనతి కాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అత్యధికంగా ఇళ్ళ పట్టాలు పంచిన మహానుభావుడని గుర్తుచేశారు. తమ జీవితాంతం పేద ప్రజల ఉన్నతి కోసం పోరాడినగొప్పవ్యక్తిఅనిఅన్నారు.నూజివీడు నియోజకవర్గంలో ఎక్కువ శాతం అటవీ భూముల ఉండడంతో వ్యవసాయ సాగు కోసరం పేదలకు పట్టాలు ఇవ్వమని ప్రభుత్వంతో పోరాడిన గొప్ప వ్యక్తి వెంకట్రావు అన్నారు.నాడు నూజివీడు పట్టణానికి ఇండోర్ స్టేడియం తెచ్చిన వ్యక్తి అని గుర్తుచేశారు. నేడు సుమారు. రూ.1.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని త్వరలో అందరికీ అందుబాటులో ఉంటుందని గుర్తుచేశారు.ఆయన శిస్యులు అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నారని వారి కోరిక మేరవిగ్రహాన్నిఅవిష్కరించామని తెలిపారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.నాడు మల్లవల్లి పారిశ్రామిక పార్క్ రావడానికి నావంతు కృషి ఉందని వెంకట్రావు ఆలోచన అంతా నూజివీడు అభివృద్ధి పైనే ఉండేదని గుర్తుచేశారు.తమ జీవితాంతం పేద ప్రజలకు అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సి, ఎచ్, దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్ పి, వెంకట్రావు, పార్టీ మండల అధ్యక్షులు, వేణు, రఘు, మధు, సాయి, ఇళయరాజా,శ్రీను, చందు, సతీష్,కూటమి నాయకులు, వెంకట్రావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంచిన మహానుభావుడు పాలడుగు : మంత్రి కొలుసు పార్థసారథి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News