Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:23 PM

నిర్మల్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

02-06-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు, సాగునీటి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నిర్మల్‌లో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News