Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద
03-05-2026 335 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. మెరుపులా వచ్చి సుమారు పది నిమిషాల పాటు రాళ్ల వర్షం పడడంతో గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది.

పంటను ఆరబెట్టేందుకు కల్లాల్లో వేసిన ధాన్యం వడగండ్ల వానకు నానిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వర్షం పడడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

నిదానపల్లిలో వడగండ్ల వాన పది నిమిషాల్లోనే ధాన్యం తడిసిముద్ద

Article Image

రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. మెరుపులా వచ్చి సుమారు పది నిమిషాల పాటు రాళ్ల వర్షం పడడంతో గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది.

పంటను ఆరబెట్టేందుకు కల్లాల్లో వేసిన ధాన్యం వడగండ్ల వానకు నానిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా వర్షం పడడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News