Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:56 AM

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
25-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్, ఫిబ్రవరి 25:

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 9 లక్షల 97 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రాన్ని దృశ్య పర్యవేక్షణ యంత్రాల ద్వారా గమనించనున్నారు.

విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యాశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News