Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:15 PM

నేటి బాలలే.. రేపటి పౌరులు!

నేటి బాలలే.. రేపటి పౌరులు!

నేటి బాలలే.. రేపటి పౌరులు!
14-04-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్

చిన్నతనం నుంచే క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున ఒలంపియాడ్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆమె ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారి విద్యార్థులకు తన చేతుల మీదుగా పట్టాలను అందజేశారు.​ఈ సందర్భంగా పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాఠశాలలు, తల్లిదండ్రులపై ఉందన్నారు. ఉన్నత విలువలతో చదువుకున్న వారు సమాజంలో ఉన్నత పదవులను అధిష్టించి, దేశ సేవలో భాగస్వాములవుతారని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, ఎంఈఓ గురువారావు, మల్లికార్జున హై స్కూల్ చైర్మన్ మారపల్లి మల్లారెడ్డి, పాఠశాల డైరెక్టర్లు భీమిడి ధరణి, మారెపల్లి తేజస్విని, ప్రిన్సిపాల్ కన్నయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

నేటి బాలలే.. రేపటి పౌరులు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News