Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 142 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నీర్నంల గ్రామంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు, ఆయన చూపిన మార్గం గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమని సూచిస్తూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

తదుపరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో ప్రతి వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి మిర్యాల లక్ష్మి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచులు గంగుల వెంకటరెడ్డి, ఆవుల పద్మ నరసింహ, మాజీ ఎంపీటీసీలు రామ్, సునీత, శివకుమార్, నాగటి ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత, సత్యప్రకాశ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

నీర్నంల గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News