Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:26 AM

నేడు కామ్రేడ్ గట్టికొప్పుల లింగయ్య 5వ వర్ధంతి

01-06-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేక పోరాటం

ప్రజా సమస్యలపై ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి

భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కీర్తిశేషులు గట్టికొప్పుల లింగయ్య గారి 5వ వర్ధంతి సందర్భంగా మోటకొండూరు మండల పరిధిలోని వర్టూరు గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో గట్టికొప్పుల లింగయ్య గారి ఐదవ వర్ధంతి వేడుకలను సిపిఐ మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం లింగయ్య గారి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వర్టూరు గ్రామానికి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు గట్టికొప్పుల లింగయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీన మండల కమిటీ,గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కీర్తిశేషులు కామ్రేడ్ లింగయ్య,బడుగు బలహీన నిరుపేద కుటుంబాల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా వారి వెన్నంటూ ఉండి,1946-1951సంవత్సర మధ్య కాలంలో తన18 సంవత్సరాల వయస్సులోనే భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొంది. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలతో గ్రామస్థాయిలో రైతు సభలను నిర్వహించి రైతులందరినీ సంఘటితం చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం,భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాటం చేశారని అన్నారు.పేద ప్రజలు ఆనాడు ఆరుగాలం కష్టపడి గ్రామాల్లో దుక్కి దున్ని వ్యవసాయం చేసి పంట పండిస్తే చేతికొచ్చే సమయంలో భూములపై అక్రమంగా భూషిస్తుల పేరిట,పన్నుల పేరుతో నిలువునా దోచుకుంటున్న నైజాం పాలకులపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘాలుగా ఏర్పాడి వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు అని అన్నారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ మండల కార్యవర్గ సభ్యునిగా అనేక ప్రజా సమస్యలపైన పోరాటం చేశారు.ఇదే వట్టూరు భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వార్డు మెంబర్ గా,నీటి సంఘం,పాల సంఘం చైర్మన్ గా ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. మా మధ్య ఆయన లేకపోయిన వారు పేదలకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి అని ఆయన లేని భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు ఏర్పడిందని కామ్రేడ్ లింగయ్య స్ఫూర్తితోనే కమ్యూనిస్టు పార్టీ బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖ సెక్రెటరీ సుదగాని వెంకన్న,గ్రామ సర్పంచ్ గట్టికొప్పుల సరిత మచ్చేందర్,గ్రామ ఉప సర్పంచ్ మోర శ్రీనివాస్ రెడ్డి,సిపిఐ మోటకొండూరు మండల సహాయ కార్యదర్శి ముసుకు పెంటారెడ్డి,మండల పార్టీ కార్యవర్గ సభ్యులు,పల్లె వెంకన్న,మంచాల రాధమ్మ,పశువుల నరసింహ,సుదర్శన్,పల్లె శ్రీనివాస్,కర్రే సిద్ధులు,నల్ల రాములు,గువ్వ వెంకన్న, వార్డు సభ్యులు గువ్వ కమలమ్మ,నోముల మహేందర్,గట్టికొప్పుల లక్ష్మీనారాయణ,అమరేందర్,శ్రీనివాస్,గట్టికొప్పుల మల్లయ్య,గువ్వ సిద్దులు కుటుంబ సభ్యులు పవన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేడు కామ్రేడ్ గట్టికొప్పుల లింగయ్య 5వ వర్ధంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News