Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:21 AM

న్యాల్కల్ 5వ వార్డ్ శ్రీ రామ్ నగర్ కాలనీలో సమస్యల పరిష్కారం | డ్రైనేజ్, మురుగు కాల్వల శుభ్రత పనులు వేగవంతం

16-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని 5వ వార్డ్ శ్రీ రామ్ నగర్ కాలనీలో సమస్యల పరిష్కారానికి పంచాయతీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అభివృద్ధి మరియు పారిశుధ్య పనులు సమగ్రంగా కొనసాగుతున్నాయి.ఈ కాలనీలో గుళ్లు, గోపురాలు అధికంగా ఉండటంతో గ్రామ ప్రజలతో పాటు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అయితే గతంలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.స్థానికుల విజ్ఞప్తి మేరకు ముందుగా చెత్త, గడ్డి తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. హ్యాండిల్ బోర్ వద్దకు వెళ్లే మార్గంలో ఉన్న మోరి ప్రజలకు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం ఆ మోరి పై తాత్కాలికంగా సిమెంట్ బండతో కప్పి ఉంచడం వల్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని శాశ్వతంగా బలమైన కాంక్రీట్‌తో నిర్మించాలని కోరుతున్నారు.ఇదిలా ఉండగా, మండల కేంద్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పారిశుధ్య పనులు చేపట్టారు. పేరుకుపోయిన మురుగు కాల్వలను పూర్తిగా శుభ్రపరచడంతో పాటు ఇరువైపుల ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. ఇటీవల ప్రచురితమైన అపరిశుభ్రతపై వచ్చిన వార్తకు స్పందించిన పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని గురువారం రోజు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.పారిశుధ్య సిబ్బంది మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో దుర్గంధం పూర్తిగా తొలగిపోయింది. పిచ్చిమొక్కల తొలగింపుతో గ్రామ పరిసరాలు శుభ్రంగా, అందంగా మారాయి.ఈ కార్యక్రమాలను గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ సరోజ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షించారు. అలాగే 5వ వార్డ్ సభ్యులు రజిత - విష్ణు కూడా పాల్గొన్నారు.గ్రామ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియా కథనాలను గ్రామస్థులు అభినందిస్తూ, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Sthanikam

న్యాల్కల్ 5వ వార్డ్ శ్రీ రామ్ నగర్ కాలనీలో సమస్యల పరిష్కారం | డ్రైనేజ్, మురుగు కాల్వల శుభ్రత పనులు వేగవంతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News