Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:25 PM

నల్లగొండలో పశుగ్రాస సంక్షోభం.. పాడి రైతుల గగ్గోలు..!

11-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లాలో తీవ్ర పశుగ్రాస సంక్షోభం నెలకొంది. వరి గడ్డి ధరలు ఆకాశాన్నంటడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ట్రాక్టర్ గడ్డి ధర రూ.8 వేలకుపైగా చేరడంతో చిన్న, మధ్య తరగతి రైతులపై భారీ భారం పడుతోంది.

గడ్డి కొరత కారణంగా పశువులకు సరిపడా ఆహారం అందక అవి నీరసంగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోగా, డెయిరీ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పరిస్థితి మరింత దిగజారడంతో కొందరు రైతులు తమ పశువులను అమ్ముకునే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు.

వేసవి తీవ్రతతో గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు తాగునీటి సమస్య కూడా తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వెంటనే పశుగ్రాస డిపోలు ఏర్పాటు చేసి, రాయితీ ధరలకు గడ్డి అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టకపోతే జిల్లాలో పాడి పరిశ్రమ కుదేలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sthanikam

నల్లగొండలో పశుగ్రాస సంక్షోభం.. పాడి రైతుల గగ్గోలు..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News