Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

నల్గొండలో ‘సన్‌రైజ్ కార్ సర్వీసెస్’ ప్రారంభం – ఒకేచోట సమగ్ర సేవలు

21-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని అద్దంకి బైపాస్ రోడ్డులో అత్యాధునిక సౌకర్యాలతో ‘సన్ రైజ్ కార్ సర్వీసెస్’ మల్టీ బ్రాండ్ కార్ వర్క్‌షాప్‌ను శనివారం ఘనంగా ప్రారంభించారు. చర్లపల్లి హైవే రోడ్డులోని టయోటా షోరూమ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ సందర్భంగా నిర్వాహకులు కాదరి శ్రీనివాస్, పి. ప్రవీణ్, కె. గణేష్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్ల యజమానులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇక్కడ అన్ని ప్రముఖ కంపెనీల కార్లకు అనుభవజ్ఞులైన మెకానిక్‌ల ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన సర్వీసింగ్ అందిస్తామని చెప్పారు. జనరల్ సర్వీస్‌తో పాటు బాడీ షాప్ పనులు, ఏసీ, ఎలక్ట్రికల్ రిపేర్లు, అత్యాధునిక వాటర్ వాష్ సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.

అదేవిధంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఈవీ సర్వీసింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సర్వీసింగ్‌తో పాటు పాత కార్ల కొనుగోలు, అమ్మకాలు, ఎక్స్ఛేంజ్ సదుపాయం, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, రెన్యూవల్స్ సేవలు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలో మెరుగైన సేవలు అందిస్తామని, వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Sthanikam

నల్గొండలో ‘సన్‌రైజ్ కార్ సర్వీసెస్’ ప్రారంభం – ఒకేచోట సమగ్ర సేవలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News