Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల తుమ్మబావి గూడెంలో దళిత రత్న వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు అప్పం సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా అనగారిన వర్గాలకు హక్కులు కల్పించి వారి అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. కులమత భేదాలు లేని సమాజ నిర్మాణమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు.

అంబేద్కర్ దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు. యువత ఉన్నత విద్యను అభ్యసించి అస్పృశ్యత, కుల వివక్షలను నిర్మూలించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ కట్ట అరుణ్ కుమార్, పావిరాల నరసింహ, బుంగ ప్రవీణ్, సాతీరు వెంకన్న, యాదయ్య, శీను, మురళి, విజయ, విజయ్, భాగ్యమ్మ, యాదమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

మునిపంపులలో అంబేద్కర్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News