Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:07 AM

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం

28-02-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రేవంత్ రెడ్డి ఆదేశాలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో కొత్త విధానం

రాష్ట్రంలోని మూడు ప్రధాన నగర కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో మూడు కార్పొరేషన్లకు సమానంగా వర్తించేలా “కోర్ అర్బన్ చట్టం”ను తయారు చేయాలని సూచించారు.హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులు, పన్నుల వసూళ్లు, అనుమతులు, ఇతర పరిపాలనా కార్యక్రమాలకు ఈ కొత్త చట్టం ఆధారంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.కోర్ అర్బన్ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరాల్లో వీధిదీపాల వ్యవస్థను సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. వీధిదీపాల పనితీరును ఎప్పటికప్పుడు గమనించే విధంగా కేంద్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.పట్టణ పరిపాలనలో పారదర్శకత, వేగం, సమన్వయం పెంచడమే కోర్ అర్బన్ చట్టం లక్ష్యమని అధికారులు వెల్లడించారు. త్వరలోనే చట్ట ముసాయిదాను సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదానికి తీసుకురానున్నట్లు సమాచారం.

Sthanikam

మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక చట్టం.. కోర్ అర్బన్ చట్టం రూపకల్పనకు ఆదేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News