Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:17 AM

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

05-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిట్యాల–భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నెలరోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హామాలీలు, లారీలు, కాంటాలను పెంచి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని, ఐదు నుంచి ఆరు కిలోల వరకు కటింగ్ చేస్తున్న మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని కోరారు.

రాస్తారోకో అరగంటకు పైగా కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో పల్లగొర్ల రామ్ దేవ్, పిట్ట కృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీశైలం, గుండాల మల్లేశ్, బుర్ర సైదులు, ఆదినారాయణ, చలపతిరెడ్డి, మారయ్య, నర్సింహ, శేఖర్, సరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మండుటెండలో రహదారిపై రైతుల రాస్తారోకో..ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

Article Image

మార్కెట్‌కు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చిట్యాల–భువనగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నెలరోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హామాలీలు, లారీలు, కాంటాలను పెంచి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని, ఐదు నుంచి ఆరు కిలోల వరకు కటింగ్ చేస్తున్న మిల్లులను తక్షణమే సీజ్ చేయాలని కోరారు.

రాస్తారోకో అరగంటకు పైగా కొనసాగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ కార్యక్రమంలో పల్లగొర్ల రామ్ దేవ్, పిట్ట కృష్ణారెడ్డి, ముద్రబోయిన శ్రీశైలం, గుండాల మల్లేశ్, బుర్ర సైదులు, ఆదినారాయణ, చలపతిరెడ్డి, మారయ్య, నర్సింహ, శేఖర్, సరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News