ఆవిష్కరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి
సూర్యాపేట, (ప్రత్యేక ప్రతినిధి):
సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో మెట్రో తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణా రెడ్డి గారు శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కొప్పుల వేణా రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం నిజమైన సమాచారం అందించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మెట్రో తెలుగు దినపత్రిక తనదైన శైలిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో పత్రిక మరింత ప్రజాదరణ పొందాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెట్రో తెలుగు దినపత్రిక ప్రతినిధులు, స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి